ఎన్నికలను బహిష్కరించాలని వెలిసిన వాల్ పోస్టర్లు

ఏజెన్సీలో వెలిసిన మావోయిస్టు వాల్ పోస్టర్లు

– దగాకోరు ఎన్నికలను బహిష్కరించాలని లేఖలో పేర్కొన్న మావోలు

తెలంగాణజ్యోతి,ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏజెన్సీ లో వెలసిన మావోయిస్టు  వాల్ పోస్టర్లు  కలకలం రేపుతు న్నాయి. వాజేడు మండలం జగన్నాథపురంలోని వై-జంక్షన్ వద్ద దగాకోరు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిం చాలని, హిందుత్వ ఫాసిస్టు బీజేపీ, ఆ పార్టీతో అంటకా గుతున్న ఇతర పార్టీలను తరిమికొట్టాలని వెంకటాపురం-వాజేడు ఏరియా మావోయిస్టు కమిటీ పేరుతో  దారి పొడవునా వాల్ పోస్టర్లు వెలిశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వాల్ పోస్టర్లను తొలగించినట్లు సమాచారం… పార్లమెంట్ ఎన్నికల వేళ మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపడంతో ఏజెన్సీ ప్రాంతంలో భ‌యానక వాతావరణం నెలకొంది. 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “ఎన్నికలను బహిష్కరించాలని వెలిసిన వాల్ పోస్టర్లు”

Leave a comment