రసాయన శాస్త్రంలో రాజ్ కుమార్ కు డాక్టరేట్
తెలంగాణ జ్యోతి, వెంకటాపూర్ : మారుమూల ప్రాంతాని కి చెందిన గిరిజన బిడ్డ రసాయన శాస్త్రంలో విశేష ప్రతిభ కనబరిచి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించడంతో డాక్టరేట్ అందుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామపంచాయతీ పరిధి వీర్లపల్లి కి చెందిన నగావత్ రాజ్ కుమార్ ప్రాథమిక ,ఉన్నత విద్యను స్థానికంగా పూర్తి చేశారు. ఇటీవల రసాయన శాస్త్ర విభాగంలో డిసైన్ అండ్ సింథసిస్ ఆఫ్ యాంటీ క్యాన్సర్ స్క్రీనింగ్ అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించడంతో హైదరాబాద్ చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ రాజ్ కుమార్ కు డాక్టరేట్ ప్రకటించారు. ప్రొఫెసర్ నరసింహ స్వామి పర్యవేక్షణలో రాజ్ కుమార్ పరిశోధన పూర్తి చేశారు ప్రస్తుతం హైదరాబాదులో ప్రముఖ సంస్థలో రసాయన శాస్త్ర విభాగం శాస్త్రవేత్తగా రాజ్ కుమార్ పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి డాక్టరేట్ సాధించేవరకు ఎదిగిన రాజ్ కుమార్ ను గ్రామస్తులు అభినందించారు.
1 thought on “రసాయన శాస్త్రంలో రాజ్ కుమార్ కు డాక్టరేట్ ”