వెంకటాపురంలో మండల ప్రజా పరిషత్ సమావేశం. 

Written by telangana jyothi

Published on:

వెంకటాపురంలో మండల ప్రజా పరిషత్ సమావేశం. 

– వ్యవసాయ అధికార్ని నిలదీసిన బర్లగూడెం సర్పంచ్ నర్సింహా మూర్తి, సభ్యులు.

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం మండల పరిషత్ అధ్యక్షులు పరిషిక సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సిబ్బంది పాల్గొన్నారు. వివిధ శాఖల పద్దులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఐసిడిఎస్, మిషన్ భగీరథ, విద్యాశాఖ,వ్యవసాయ శాఖ తోపాాటు తదితర శాఖలపై ప్రజా ప్రతినిధులు సమావేశంలో చర్చించారు.ముఖ్యంగా వ్యవసాయ శాఖ పద్దులపై మండ లంలోని భర్లగూడెం  సర్పంచ్  కొరస  నరసింహ మూర్తి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆదివాసీ చట్టాల పైన సభలో చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన గురుకులం కాబట్టే ఇంత నిర్లక్ష్యం. అని సమావేశంలో విథ్యాదికారి ని నిలదీశారు. వెంకటాపురం మండలానికి గిరిజన గురుకులం పాఠశాల మంజూరు కాగా అధికారులు నిర్లక్ష్యం కారణంగా స్థలం లేదని అనే నేపంతో వాజేడు మండలానికి తరలి పోయిందని, గిరిజన గిరుకులం కావడంవలనే అధికారులు నిర్లక్ష్యం చేశారని, గిరిజన గురుకులం నెలకొల్పటానికి ఏర్పాటు చేయటానికి వెంకటాపురంలో ,ప్రభుత్వ స్థలం లేదా అని సమావేశంలో సర్పంచ్ నరసింహమూర్తి,సబ్యులు అధికారులను నిలదీశారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే మండల పరిషత్ సమావేశం లో ప్రజా సమస్యలను చర్చించాల్సి ఉంటుంది. కానీ ప్రజా సమస్యల పైన సభలో చర్చ జరగక పోవడం విచారకరం అని విమర్శించారు. శాఖల అధికారులు అందరు ఎందుకు హాజరు కాలేదని, ఇంత నిర్లక్ష్యం మా అని బర్లగూడెం సర్పంచి కొర్స నర్సింహా మూర్తి థ్వజమెత్తారు. ఎంపిడిఒ ఏ.బాబు బదులు ఇస్తూ అందరికి ఆహ్వానం ఇచ్చినట్లు తెలిపారు. మండల వ్యవసాయ అధికారి జి.నర్సింహరావు తమ శాఖ ప్రగతి నివేదిక గురించి సభలో చెప్పారు. ఈమేరకు సబ్యులు అడిగిన ప్రశ్నలకు ఏ.ఒ . సరైన సమాధానం లేక పోపటంతో సబ్యులు థ్వజమెత్తారు. సర్పంచి నర్సింహా మూర్తి లేచి మాట్లాడుతూ ఎరువులు ,పురుగు మందుల దుకాణాల్లో గడువు ముగిసిన ఎరువు లను, నకిలీ పురుగు ముందులను కొంతమంది డీలర్లు వ్యాపారులు ఏజెన్సీ లో చదువు లేని రైతులకు విక్రయిస్తు న్నారని, మండల వ్యవసాయ అధికారిగా వాటిని ఎందుకు అరికట్టడం లేదని వ్యవసాయ అధికారి గుంటుక నర్సింహా రావుని ప్రశ్నించారు. గ్రామాలలో రైతు సదస్సులు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగం లోని ఆధునిక మెలుకువలు నేర్పిం చక పోవడం లో, అంతర్యం ఏమిటన్నారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎరువులు ,పురుగు మందుల దుకాణాలను తనిఖీ లు చేశారని, ఎన్ని కేసులు పెట్టారో ప్రజలకు తెలపా లని ఆయన సభలో పట్టు పట్టారు. ఒప్పంద వ్యవసాయం పేరుతో కొంతమంది దళారులుగా వ్యవహారిస్తూ, నకిలీ మొక్క జొన్న విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. దీనితో వ్యవసాయ అధికారి సమాధానం చెప్పక పోగా మౌనంగా ఉండిపోయారు. పండించిన వడ్లు అమ్ము కునే విదంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం తో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశారు. మండలంలో బడి మానేసిన విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరుగుతున్నాయో కారణాలు తెలపాలని మండల విద్యా శాఖా అధికారి వెంకటేశ్వర్లు ని ప్రశ్నించగా విద్యాశాఖ అధికారి సమాధానం చెప్పక పోవడం తో సభ్యులు అంత సభలో విద్యా శాఖా పని తీరు పైన అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో యువత గంజాయి కి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నట్లు నర్సింహా మూర్తి సభ దృష్టికి తీసుకుపోగా సభా అధ్యక్షులు ఎంపిపి సతీష్ కుమార్ స్పందిస్తూ పోలీసులకు తెలియజేసీ తక్షణమే అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అంగన్వాడీ ప్రాజెక్ట్ అధికారిని శిరీష తమ శాఖకు సంబందించిన ప్రగతి నివేదిక ను చదివి వినిపించారు. మండలం లోని పదకొండు మంది అనాధ పిల్లలకు ఒక్కొక్కరికి నాలుగు వేల రూ. ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలిపారు. శామ్ మ్యామ్ పిల్లల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేయాలని ప్రాజెక్ట్ అధికారిని సబ్యులు కోరారు. పాలెం వాగు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు సర్వ సభ్య సమావేశానికి రాక పోవడం తో సభ్యులు అంత అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యుల అనుమతి తో 1/70, పెసా చట్టాల పైన చర్చ జరపాలని సబ్యులు, సభా అధ్యక్షు లు అయిన సతీష్ కుమార్ ని కోరారు. కీలకమైన శాఖలు అయిన ఇరిగేషన్, అటవీ శాఖా, రెవిన్యూ, ఎక్సైజ్, ఆర్. అండ్బీ శాఖలకు సంబందించిన అధికారులు హాజరు కాకపోవడం తో ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే సభ ముగిసింది. ఈ సమావేశంలో జడ్పిటిసి పాయం రమణ, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, వివిధ ప్రజా సమస్యలపై సమా వేశంలో మాట్లాడారు. సమావేశంలో పలు శాఖల అధికారు లు ఎంపీడీవో ఏ. బాబు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now