గ్రామపంచాయతీ సర్పంచ్ లతో పోలీస్ స్టేషన్లో సమావేశం

Written by telangana jyothi

Published on:

గ్రామపంచాయతీ సర్పంచ్ లతో పోలీస్ స్టేషన్లో సమావేశం

– పంట పొలాలకు విద్యుత్ ఫెన్సింగ్ ఏర్ఫాటు పై అప్రమత్తంగా ఉండాలి .

– వెంకటాపురం సి.ఐ బండారి కుమార్ . 

 వెంకటాపురంనూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులతో వెంకటాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహిం చారు. పంట పొలాలుకు గ్రామీణ అటవీ ప్రాంతాల్లో రైతులు, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో అడవి జంతువుల నుంచి పంట రక్షణ కోసం కొంత మంది రైతులు పంట పొలాలకు కరెంటు తో కూడిన ఫెన్సింగ్ వేయడం జరుగుతున్నట్లు సమాచారం వుంద ని అన్నారు. ఎవరైనా రైతులు రాత్రి వేళలో వారి,వారి పంట పొలాల దగ్గరికి వెళ్లే క్రమంలో అట్టి కరెంటు షాక్ గురై మరణించే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల కాలంలో ములుగు మండలంలో ఒక రైతు రాత్రి వేళలో పంట పొలాలకు వెళుతున్న క్రమంలో కరెంటు ఫెన్సింగ్ షాక్కు గురై మరణించడం జరిగింది. కావున రైతులు ఎవరు కూడా అడవి జంతువుల నుంచి రక్షణ కోసం పంట పొలాలకు కరెంటుతో కూడిన ఫెన్సింగ్ వేయకుండా వుండా లని ఈ విషయంపై గౌరవ సర్పంచ్లు తమ పంచాయతీ గ్రామా లలో ప్రజల భద్రత కోసం టామ్ టామ్ వేయించి పోలీస్ శాఖకు సహకరించాలని ,సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ కోరారు. ఎవరైనా చేసినట్లయితే వారి పైన చట్టరీత్య చర్యలు తీసుకొనబడుతాయని, ఇట్టి విషయాన్ని గ్రామాలలో రైతులం దరికీ తెలియజేయవలసిందిగా సర్ఫంచులను కోరారు. అదేవిధంగా గ్రామాలలో జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రతి గ్రామ పరిధిలో సీ.సీ కెమెరాలు నిఘానేత్రాలు ఏర్పాటు చేయుటకు , మరియు సిసి కెమెరాలు యొక్క ప్రాముఖ్యత ను గురించి వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా ఊర్లకు వెళ్ళినట్లయితే వారందరూ కూడా విలువైన వస్తువులను సక్రమంగా భద్ర పరుచుకోవాల్సిందిగా, మండల ప్రజలను కోరారు. గ్రామాలలో జరిగే కోడి పందాలు , పేకాట లు , గుడుంబా తయారీ, మరియు అమ్మకదారుల గురించి, గంజాయి వినియోగం, అమ్మకం,రవాణా దారుల గురించి వెంకటాపురం పోలీసు వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందించవలసిందిగా వెంకటాపురం మండల సర్పంచ్ ల సమావేశం లో సి.ఐ. కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎస్సై రేఖ అశోక్ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now