దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా ఏడాదికి పైగా జైలు శిక్ష విధించారని కాటారం ఎస్సై అభినవ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వ పరాలు ఈ విధంగా ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ 22, 23 మధ్య రోజుల్లో గారేపల్లి, ఆదర్శ కాలనీలో గల ముస్కుల సురేందర్ రెడ్డి అనువారింట్లో, అదే సమయంలో పక్కన గల్లిలో గల రేపాల వేణుగోపాల్ అను వారిండ్లలో ఎవరు ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసినారు. ముస్కుల సురేందర్ రెడ్డి, వేణుగోపాల్ ల ఫిర్యాదు మేరకు ఎస్సై కాటారం ఎస్ఐ అభినవ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా దొంగతనం చేసిన వ్యక్తి మంచిర్యాల జిల్లా నీల్వాయి కు చెందిన చింతకింది సతీష్ ముదిరాజ్ (38) అని గుర్తించి భూపాలపల్లి ఏ జె ఎఫ్ ఎం సి కోర్టు భూపాలపల్లి యందు హాజరు పరిచి రిమాండ్ కి పంపించి దర్యాప్తు పూర్తి చేసి చార్జి షీట్ దాఖలు చేశారు. అనంతరం ఇట్టి కేసు పై కోర్టు కానిస్టేబుల్ రాజేందర్ సాక్షుల ను ప్రవేశపెట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అర్థ కుమార్ చే కోర్టు ట్రయల్ జరిగిన అనంతరం భూపాలపల్లి అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ జీ అఖిల తీర్పు వెలువరించారు.దొంగతనం చేసిన వ్యక్తి చింతకింది సతీష్ అని నిర్ధారించి అతనికి ఒక సంవ త్సరం మూడు నెలల (15 నెలల) జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.