108 అంబులెన్స్ లో ప్రసవం : తల్లి బిడ్డ క్షేమం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం మండలానికి చెందిన దుర్గం సాంబ లక్ష్మికి పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు 108 కి కాల్ చేయగానే కాటారంలో ఉన్న 108 అంబులెన్స్ సిబ్బంది సాంబలక్ష్మి ఇంటికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది కాటారం నుండి భూపాలపల్లి డిస్టిక్ హాస్పిటల్ కు తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ లో ప్రసవించింది. అంబులెన్స్ లో ఉన్న టెక్నీషియన్ గమనించి మేడిపల్లి సమీపంలోని టోల్గేట్ వద్ద ఆపడంతో నార్మల్ డెలివరీ జరిగింది. మగ బిడ్డ జన్మించగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని భూపాలపల్లి డిస్టిక్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి అడ్మిట్ చేసినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శ్రీకాంత్, పైలట్ ప్రవీణ్ కుమార్ ఆశ పద్మ ఉన్నారు.