హత్యాయత్నం కేసులో వ్యక్తి రిమాండ్
కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : హత్యాయత్నం కేసు లో వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు కన్నాయిగూడెం ఎస్సై సురేష్ మీడియాకు వివరించారు. మండలంలోని రాజన్నపేట పంచాయతీ పరిది గంగూడెం గ్రామానికి చెందిన కావేరి రవీందర్ అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన కావేరి ప్రమోద్ విద్యుత్ షాక్ పెట్టి హత్యా యత్నం చేశాడని బాధితుడు రవీందర్ భార్య ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని ప్రమోద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో హాజరు పరిచారు. జడ్జి నిందితుడు ప్రమోద్ కు రిమాండ్ విధించినట్లు ఎస్సై సురేష్ వెల్లడించారు.