తల్లిదండ్రులూ జర జాగ్రత్త…
– ఒక పూట బడుల నేపథ్యంలో ఈతకు వెళ్లకుండా చూడాలన్న ఎస్సై
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించాలని, చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లకుండా చూడాలని కన్నాయిగూడెం ఎస్సై నరేష్ సూచించారు. వేసవి ఎండల నేపథ్యంలో శుక్రవారం నుంచి పాఠశాలలకు మధ్యాహ్నం వరకే నిర్వహి స్తుండగా ఇంటికి చేరుకునే చిన్నారులపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గోదావరి నది, చెరువులు, కుంటల వద్దకు తమ పిల్లలను వెళ్లనీయొద్దన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబాల్లో విషాదం నెలకొంటుందన్నారు. ఇంటివద్దే ఉండేలా తల్లిదండ్రులు వారిని కనిపెట్టుకుంటూ ఉండాలని ఎస్సై సురేష్ కోరారు.