సింగరేణి కార్మికుల సమస్యలపై మాల జేఏసీ నేత వినతి
తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్ ను మర్యాదపూర్వకంగా బుధవారం ఉత్తర తెలంగాణ మాల జే ఏ సి నాయకులు పీక కిరణ్ కలిశారు. హైదరాబాద్ సింగరే ణి భవన్ లో డైరెక్టర్ కు పుష్పగుచ్చం అందించి కిరణ్ శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ కార్మికులు ఎదుర్కొంటున్న సమ స్యలను ప్రస్తావించారు. సింగరేణి కార్మికులకు ప్రమోషన్లు కల్పించా లని కిరణ్ విజ్ఞప్తి చేశారు. సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్ కు తాము విన్నవించిన సమస్యలపై సానుకూలంగా స్పందించి, తగిన సమయంలో సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు పీక కిరణ్ వెల్లడించారు.
1 thought on “సింగరేణి కార్మికుల సమస్యలపై మాల జేఏసీ నేత వినతి”