పనితీరు మెరుగ్గా ఉండాలి : జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మెరుగ్గా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం కాటారం మండలంలో ఆయన పర్యటించారు. మొదటగా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వాక్సినేషన్ కార్యక్రమా న్ని ఆయన పరిశీలించారు. తల్లి, బిడ్డలకు అన్ని రకాల పరీక్షలతో పాటు సేవలను అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆస్ప త్రిలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సమయ పాలన పాటించాలని, ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించి నట్లయితే చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థు లకు తరగతి గదిలో ఉపాధ్యాయునిగా పాఠాన్ని బోధించారు. కలె క్టర్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థినిలకు కలెక్టర్ స్వయంగా పెన్నులను బహుకరించారు. పాఠశాలలో పరి శుభ్రతను పాటించాలని,మంచినీటి సదుపాయం సక్రమంగా ఉండా లని ఆదేశించారు. ఉపాధ్యాయుల ఉపస్థితి పై ఆయన వాకబు చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మంతెన మౌనిక, మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
1 thought on “పనితీరు మెరుగ్గా ఉండాలి : జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ”