కాటారంలో ఎల్ ఆర్ ఎస్ సర్వే
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల సర్వే శర వేగంగా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలంలో మంగళవారం సర్వే బృందం పనులు మొదలు పెట్టింది. కాటారం మండలంలో మండల పంచాయతీ అధికారి పీ వీరస్వామి ఆధ్వర్యంలో ఎల్ ఆర్ ఎస్ సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ పంచాయతీ కార్యదర్శి షఘీర్ ఖాన్, నవ్యశ్రీ, పి శ్రీనివాస్, నాగరాజు, రాజశేఖర్, వంశీకృష్ణ, గంగాధరన్, ప్రవీణ్, కుమార స్వామి, రెవిన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.