పల్లెల్లో జోరుగా బెల్టు దందా..!
– పుట్టగొడుగుల్లా బెల్టు దుకాణాలు..?
– నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు
– పచ్చని సంసారంల్లో మద్యం చిచ్చు..
– మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు..!
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : పల్లెల్లో బెల్టు షాపులు జోరుగా సాగుతున్నాయి. పల్లెలు, మారుమూల గ్రామాలు మత్తులో మునిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపు లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు విరు ద్ధంగా బెల్టుషాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయి స్తున్నారు. చాలా మంది బెల్టు షాపుల నుంచి మద్యం కొను గోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కాపురాలు విదీపాలవుతున్నాయి. కన్నాయిగూ డెం మండలంలో బెల్టుషాపులు బహిరంగానే నడుస్తున్నాయి. లైసెన్స్ ఉన్న వైన్ షాపుల నుంచి బెల్టుషాపులకు వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. సంబంధిత ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లో బెల్టుషాపుల నిర్వహణకు ప్రోత్సాహం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలు, తాండాల్లో బెల్టుషాపుల జోరు కొనసాగి జనం మత్తులో చిత్తవుతున్నారు. ఒకవైపు స్వయం ఉపాధితో గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తుంటే మరోవైపు బెల్టుషాపులు నిర్వహకు లు విచ్చలవిడిగా విక్రస్తున్నారు. అధికార యంత్రాంగం చర్య లు తీసుకోవడంలో విఫలమవుతోంది.
పచ్చని సంసారాల్లో చిచ్చు..
మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా దర్శనమ్మిస్తున్నాయి. దీంతో పొద్దం తా పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడుతున్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తుండటంతో యువత పెడదారి పడుతోన్నారు. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేరుకే కిరాణాలు.. అమ్మేది మద్యమే..!
మండల వ్యాప్తంగా కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మద్యం వ్యాపారం చేస్తున్నారు. పెద్ద పెద్ద ఫ్రిజ్ లను సొంత ఇళ్లలో పెట్టుకుని మరీ విక్రయిస్తున్నారు. వైన్ షాపుల యజమానులు ఆటోల ద్వారా ఊరూరా మద్యం సరఫరా చేస్తున్నారు. నిత్యం తమకు కేటాయించిన గ్రామాలకు ఆటోల్లో పంపిస్తుంటారని, మద్యం మత్తులో అర్ధరాత్రి వరకు హంగామా చేస్తూ ఇంటి మధ్యలో గొడవకు దిగుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు ఎరులైపారుతోంది.
ఎక్సైజ్ సిఐ వివరణ
తెలంగాణ జ్యోతి పత్రిక విలేకరి ఎక్సైజ్ సీఐ రామకృష్ణను చరవాణిలో వివరణ కోరగా..గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని, బెల్ట్ షాపులపై తనిఖీలు నిర్వ హిస్తున్నామన్నారు.