శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రామగుండం సి పి
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలసి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వారిని అర్చకులు రాజగోపురం నుండి ఆలయ మర్యాదలతో స్వాగ తం పలికి స్వామివారికి అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం, అనంతరం అర్చకులు శేష వస్త్రాలతో సన్మానించి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సిబ్బంది కాళేశ్వరం ఎస్సై చక్రపాణి, కోటపల్లి ఎస్సై రాజేందరు పాల్గొన్నారు.