యదేశ్చగా మద్యం దందా..?
– కన్నాయిగూడెం వైన్స్ నుండి చతిస్గఢ్ రాష్టానికి సరఫరా..!
– నిద్రమత్తులో ఎక్సైజ్ శాఖ..?
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలంలో మద్యం దందా జోరుగాసాగుతోంది..ఏ వీధిలో చూసిన మద్యం ఏరులై పారుతోంది. నియమాలకు తూట్లు పొడిచి, అక్రమ సంపాదనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు నూతన ఒరవడికి తెరలేపా రు. ఆయా గ్రామాల్లో షాపు యజమానులందరూ కుమ్మక్కై తమ దందాను విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసుకొని గుర్రెవుల వైన్స్ షాప్ నుంచి చతిస్గఢ్ రాష్టానికి మద్యాన్ని తరలిస్తున్నారు. కన్నాయిగూ డెం, తాళ్లగూడెం గ్రామానికి చెందిన కొందరు వ్యాపారులు పడవల సాయంతో తుపాకులగూడెం గ్రామానికి చేరుకుని అక్కడ టాటా మ్యాజిక్ వాహనాన్ని అద్దెకు తీసుకుని గుర్రెవు ల వైన్స్ షాప్ వద్దకు వచ్చి మద్యం బాటిళ్లను మ్యాజిక్ లో నింపి మధ్యాహ్నం సమయంలో తరలిస్తున్నారని పలువురు స్థానికులు చెబుతున్నారు. ఎమ్మార్పీ ధర కంటే ఒకో ఫుల్ బాటిల్ పై 80 రూపాయలు అదనంగా తీసుకుంటూ తమ దందాని కొనసాగిస్తున్నారు. అదనపు ధరతో ఒక్క రోజుకు లక్షలాది రూపాయలు వెనకేసుకుంటూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. ఇంత దందా అధికారులు ముందే అక్రమ రవాణా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇంతవరకు మద్యం షాపులపై తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. సంబం ధిత అధికారులు స్పందించి వైన్స్ షాప్ యాజమాన్యలపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.