విఆర్ కె పురంలో సి.ఐ బండారి కుమార్ చేతుల మీదుగా చీరెల పంపిణీ

విఆర్ కె పురంలో సి.ఐ బండారి కుమార్ చేతుల మీదుగా చీరెల పంపిణీ

– బతుకమ్మలను పేర్చిన ప్రతి అడ బిడ్డకు చీరలు పంపిణీ. 

వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటా పురం మండలం వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధి లోని చొక్కాల గ్రామంలో తెలంగాణ వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ ఆధ్వర్యంలో గ్రామ ఆడ పడుచులు సద్దుల బతుకమ్మ గౌరమ్మ తల్లి సాగనంపే వేడుక లను అర్ధరాత్రి వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను గ్రామంలో మంగళ వాయిద్యాలు మేళతాళాల మధ్య బతకమ్మ గద్దెల వద్దకు తీసుకువచ్చి గ్రామం యావత్తు మహిళా సోదరీమణులు ఆడి, పాడి గౌరమ్మను వెళ్లి రావమ్మ గౌరమ్మ తల్లి చల్లంగా చూడాలంటూ సాగనంపారు. చొక్కాల గ్రామంలో వైభవంగా జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు ముఖ్య ఆహ్వానితులు గా హాజరైన వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ అందంగా అలంకరించిన బతుకమ్మలను చూసి ఆయా సోదరీమణులను అభినందించారు. అలాగే బతుక మ్మలను తెచ్చిన ప్రతి ఆడబిడ్డకు వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ ఆధ్వర్యంలో సీ.ఐ కుమార్ చేతులు మీదుగా మహిళా సోదరీమణులకు చీరెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ కె పురం మాజీ సర్పంచ్ పునెం శ్రీదేవి, ఉప సర్పంచ్ డర్రా శివరాణి, సంఘం జిల్లా ముఖ్య సలహాదారు బద్ది ఆదినారాయణ, డర్ర రాం ప్రసాద్, కొప్పుల మల్లయ్య, దినేష్, రవి, వెంకటేశ్వర్లు, పోతు రాజు, వెంకటేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment