ఆత్మన్యూనత భావం విడనాడాలి

Written by telangana jyothi

Published on:

ఆత్మన్యూనత భావం విడనాడాలి

– ప్రణాళికతో చదివితే పక్కా విజయం

– భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : గ్రామీణ నేపథ్యం, పేదరికం, పోటీపరీక్షల సన్నద్దతకు అడ్డు కాదని, సాధించా లన్న దృఢ సంకల్పం, పక్కా ప్రణాళికతో, పట్టుదలతో చదివితే విజయం వరిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే (ఐ పీ ఎస్) అన్నారు. గురువారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సహకారంతో కాటారంలోని బీ ఎల్ ఎం గార్డెన్ లో పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే 60 మంది నిరుద్యోగ యువతకు ఎస్పి కిరణ్ ఖరే స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పి కిరణ్ ఖరె మాట్లాడుతూ పేదరికంతో పోటీ పరీక్షలకు దూరమవుతున్న అటవీ గ్రామాల నిరుద్యోగ అభ్యర్థులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఉత్తమ అధ్యాపకుల చేత శిక్షణ ఉంటుందని, యువత మంచి స్థాయికి చేరుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడం సులువు కాదని, గట్టిగా ప్రయత్నిస్తే, అసాధ్యం ఏమీ ఉండదని ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. నిరంతర శ్రమ, అహర్నిశలు కృషి చేసినప్పుడు కోరుకున్న స్థాయికి చేరుకోగలమని ఎస్పి పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగ అభ్యర్థులు తల్లిదండ్రుల కలలను సాకారం చేయడంతో పాటు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించాలని ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ రికగ్నైసేడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రేస్మా ) కాటారం అధ్యక్షులు శ్రీశైలం, మహాదేవ పూర్ చీర్ల తిరుపతి రెడ్డి, కాటారం, మాహాదేవ్ పూర్ సిఐలు నాగార్జున రావు, రాజేశ్వరరావు, కాటారం, కాళేశ్వరం, కొయ్యూరు, అడవి ముత్తారం, ఎస్సైలు అభినవ్, భవాని సేన్, నరేష్, మహేందర్ లతో పాటు నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.

Leave a comment