విప్లవ పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవండి
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశానుసారం ఏటూరునాగారం ఎస్సై కృష్ణ ప్రసాద్ గోగుపల్లి గ్రామనికి చెందిన ఈసం అర్జున్ గత కొన్ని సంవత్సరాల నుండి మావోయిస్టు విప్లవ పార్టీలో కొనసాగుతున్నట్లు తల్లిదండ్రులకు తెలిపారు. జనజీవన స్రవంతి లో అర్జున్ కలిస్తే అతనికి ప్రాణహాని జరగకుండా ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు అందిస్తామని వారికి వివరించారు. అలాగే ఇంకెవరైనా మీకు తెలిసిన విప్లవ పార్టీలో పని చేసే సమాచారాన్ని మాకు తెలియజేస్తే వాళ్లకు కూడా ఎలాంటి ప్రాణహాని జరగకుండా ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు అందిస్తామని ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తెలిపారు.