భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి.

Written by telangana jyothi

Published on:

భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి.

– ఎస్సి, ఎస్టీ అవాసాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి.

– అణగారిన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు. 

– రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్: బక్కి వెంకటయ్య.

– జిల్లా కలెక్టర్, సీ.పీల పనితీరు భేష్ : చైర్మన్ కితాబు.

ములుగు ప్రతినిధి : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూ సమ స్యలు,అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శని వారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అధ్యక్షతన ఎస్ పి షబరిష్, కమిషన్ సభ్యు లు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, రేణిగుంట్ల ప్రవీణ్ ల తో కలిసి ల్యాండ్, సర్వీస్, అట్రాసిటీ కేసులు వివిధ అంశాలపై సమీక్షించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ శభరిష్ పుష్ప గుచ్యలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.అనంతరం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కలెక్టర్ కార్యాలయంలో పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లాలో వివిధ శాఖల ద్వారా ఎస్సీ ఎస్టీలకు అందుతున్న అభివృద్ధి ఫలాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి మంజూరైన నిధులు, వినియోగించి నిధులకు సంబంధించిన వివరాలను శాఖల వారీగా అధికారులు వివరించారు.  ఈ సందర్భంగా ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాల న్నారు. అన్ని రకాల పెండింగ్ కేసులను 15 రోజుల్లో పరిష్క రించాలని సూచించారు. ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చైర్మన్ సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఎంత మాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ వెంకటయ్య కలెక్టర్, ఎస్. పీలకు సూచించారు. పోలీస్ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పక్కాగా అమలు జరిగేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బంది పని చేయాలని హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీలను వేధింపులకు గురి చేసే అధికారులపై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలకు సమస్య లు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తోందని తెలిపారు. ప్రతీ నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే, ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమా వేశాలు నిర్వహించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.  ఎస్పి శబరిష్ చక్కగా పని చేస్తున్నారని జిల్లా ప్రజలలో మంచి పేరు వినిపిస్తోందని ఈ సందర్భంగా చైర్మన్ వారిని అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీల అభి వృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ శాఖల ద్వారా సంక్షేమ పథకాలు అందేలా జిల్లా యంత్రాంగం తరపున కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొం దించి చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సమావేశం లో డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సి . హెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు, ఆర్డిఓ కె. సత్య పాల్ రెడ్డి, జిల్లా ఎస్సీ , బిసి సంక్షేమ అధికారులు లక్ష్మణ్ నాయక్, రవిందర్ రెడ్డి, ఎస్సి కార్పొరేషన్ ఈ డి తుల రవి, జిల్లా అధికారులు, తాహసిల్దార్లు, ఎం పి డి ఓ లు, మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now