హిందూ ఆలయాలపై దాడులు చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి
– బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి విశ్వనాథ్
ములుగు ప్రతినిధి: తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ లో ముత్యాలమ్మ, ఆంజనేయస్వామి ఆలయాల్లో దాడులు చేసి దేవతల విగ్రహాలను విధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అదికార ప్రతినిధి సూర్యదేవర విశ్వనాథ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులు చేసినా ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించడం, ఓ వర్గానికి మాత్రమే మద్దతు పలకడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో పాలకులు వివక్ష చూపొద్దని, దేవాలయాలను కూల్చాలనే కుట్ర హోటల్ లో నిర్వహించిన ప్రసంగాలకు ఉత్ప్రే రకంగా జరిగిందా? లేక విదేశీయులు, అన్యమతస్థుల కుట్ర ఏమైనా దాగి ఉందో పోలీసు అధికారులు తేల్చాలని డిమాండ్ చేవారు. కూల్చి వేతకు కారకులైన దుండగులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు ఐక్యంగా నిరసన చేపడుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం లౌకికవాదాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని, వెంటనే దాడికి కారకులను అరెస్ట్ చూపి ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. హిందువుల మనోభావా లను కాపాడాలని కోరారు. కాగా, గ్రూప్ 1 విద్యార్థుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేవై ఎం నాయకులపై లాఠీచార్జీ చేసి రాష్ర్ట అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేవైఎం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి హరీష్ గౌడ్ ఒక ప్రకటనలో అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ అరెస్ట్ సైతం అక్రమమని, ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరస నలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల లెక్క నియంత పోకడలు చేస్తోందని విమర్శించారు.