బాలాజీ హై స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు, మాక్ పోలింగ్

Written by telangana jyothi

Published on:

బాలాజీ హై స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు, మాక్ పోలింగ్

ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి మరియు మాక్ పోలింగ్ జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ములుగు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిహెచ్ వెంకటేశ్వర రావు హాజర య్యారు.  కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న చిన్నా రి గోపికలను, కృష్ణులను ఇంత చక్కగా తయారుచేసిన తల్లిదండ్రులకు టీచర్స్ కు, నిర్వహించిన పాఠశాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఉన్నతమైన సమాజానికి ఓటు ప్రధాన ఆయు ధమని సూచించారు. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియ చేశారు.ఈ కార్యక్రమాలకు సభాధ్య క్షత వహించిన ప్రిన్సిపాల్ కొలగాని రజనీకాంత్ మాట్లాడు తూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం ఎత్తాడని పిల్లలకు తెలి యజే శారు.సమాజంలో ఓటుహక్కు వజ్రాయుధం వంటిదని, ఓటు వినియోగంతో ప్రజా సమస్యల పరిరక్షనే ధ్యేయంగా పాలకవ ర్గాన్ని ఎన్నుకునే అవకాశం, ఓటర్ చేతుల్లో ఉంటుందని విద్యా ర్థులకు మాక్పోలింగ్ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్ర మానికి బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి  విచ్చేసి విద్యార్థినీ, విద్యార్థులకు శుభా కాంక్షలు చేశారు. ఇట్టి కార్యక్రమంలో సోషల్ టీచర్ రతన్ సింగ్, ఉపా ధ్యాయుని ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment