ఆదర్శలో అలరించిన కృష్ణాష్టమి వేడుకలు
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్లో శనివారం నిర్వహించిన ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్నారులు గోపికలు, శ్రీకృష్ణుడి వేష ధారణలతో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నా రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాం డెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ జనగామ కృషిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.