Konda sureka | రాహుల్ బస్సు యాత్రలో కొండా సురేఖకు గాయాలు

Konda sureka | రాహుల్ బస్సు యాత్రలో కొండా సురేఖకు గాయాలు

భూపాలపల్లి ప్రతినిధి : రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లిలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో కొండా సురేఖ  ప్రమాదానికి గురయ్యారు. స్వయంగా స్కూటీ నడిపిన కొండా సురేఖ.. పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొంది. అయితే ఈ ర్యాలీలో ఆమె నడుపుతున్న స్కూటీ అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో కుడి కన్ను పై భాగం, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళీ హుటాహటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమెకు తగిలిన గాయాలు చూసి కంటతడి పెట్టుకున్నారు.

Konda sureka | కొండా సురేఖకు యాక్సిడెంట్...

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Konda sureka | రాహుల్ బస్సు యాత్రలో కొండా సురేఖకు గాయాలు”

Leave a comment