కాటారం సీసీ కెమెరాల నిర్వహణ కమిటీ ఏర్పాటు
– అధ్యక్ష కార్యదర్శులుగా కలికోట శ్రీనివాస్, కవ్వాల చంద్ర శేఖర్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ప్రధానమైన పట్టణంగా వర్ధిల్లుతున్న కాటారం మండలం గారేపల్లి కేంద్రంగా సీసీ కెమెరాలు ఏర్పాటు అత్యా వశ్యకమై ఉన్న నేపథ్యంలో పోలీసు శాఖ సహకారంతో సీసీ కెమెరాల నిర్వహణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు పోలీసు శాఖ త్రిమూర్తులైన కాటారం సబ్ డివిజనల్ అధికారి గడ్డం రామ్మోహన్ రెడ్డి, సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఈవూరి నాగార్జున రావు, సబ్ ఇన్స్ పెక్టర్ మ్యాక అభినవ్ ఆధ్వర్యం లో కాటారం మండల వ్యాపార, వర్తక, వాణిజ్య వేత్తలు, పుర ప్రముఖులు, పలు సంస్థలు, రాజకీయాలకు అతీతంగా పలు వురు నేతలు, స్వచ్ఛంధ కార్యకర్తలు, దుకాణ యజమానుల తో పరస్పర సమన్వయ చర్చలు నిర్వహించారు. అనంతరం సీసీ కెమెరాల నిర్వహణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా కలికోట శ్రీనివాస్, కార్యదర్శిగా కవ్వాల చంద్రశేఖర్, కోశాధికారిగా ఎండి రఫీలు ఎన్నికయ్యా రు. అలాగే కార్యవర్గ సభ్యులుగా పంతకాని సమ్మయ్య, కొట్టే శ్రీహరి, నాయిని శ్రీనివాస్, కొట్టే ప్రభాకర్, పులి అశోక్, బొమ్మన రవీందర్ రెడ్డి, కామిడీ వెంకట్ రెడ్డి, బండి శ్రీనివాస్, మిడిదొడ్ల రాజు, కొట్టే శ్రీశైలం, చినాల రమేష్ రెడ్డి, దారం నగేష్, ఆత్మకూరి కుమార్, తదితరులు ఎన్నికయ్యారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే, శాంతిభద్రతల సమస్యలు తలెత్త కుండా ఉండాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు ముఖ్యమని పోలీస్ శాఖ ఈ సందర్భంగా విశధికరించింది. కాగా పుర ప్రముఖులు, ప్రతి దుకాణదారులు వారి సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి దాదాపు 10 లక్షల రూపాయల వరకు నిధిని సమకూర్చారు. దీంతో గ్రామ కూడళ్ళు, చావడీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దాంతో పాటు నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు ఎంత గానో దోహదపడుతుందని పోలీస్ శాఖ ఉద్ఘాటించింది. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ఎవరైనా విరాళాలు అందించా లనుకుంటే నిర్వాహణ కమిటీని సంప్రదించాలని కోరారు.