గణంగా కోటి హరిద్రా గౌరమ్మ పూజలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగురు వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతమైన వెంకటా పురం మండల కేంద్రంలో కోటి హరిద్రా గౌరమ్మ పూజలను బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. వెంకటా పురం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి శ్రీ అలివేలు మంగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పసుపుతో కోటి హరిద్ర గౌరమ్మ ను భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహిళ లందరూ కలిసి సామూహికంగా, పసుపుతో గౌరమ్మలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళలతో అమ్మవారిని, వెంకటాపురం ప్రధాన వీధులలో వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఈ కార్యాక్రమంలో, మహిళలు ఆర్యవైశ్య మహిళలు గ్రామ మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.