కళ్యాణం.. కమనీయం…
– చూసి తరించిన భక్త జనం
కాటారం, తెలంగాణ జ్యోతి : శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గ్రామ గ్రామాన అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలేశ్వరంలో రామాలయం, మంత్రి శ్రీధర్ బాబు స్వగ్రామమైన ధన్వాడ దత్తాత్రేయ దేవాలయంలో, కాటారం భక్తాంజనేయ స్వామి దేవాలయం, బొప్పారం లోగల సీతారామచంద్రస్వామి దేవాలయం, దామెర కుంట, బయ్యారం భూపాలపల్లి మంజూరునగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, భూపాలపల్లిలోని సీతారామచంద్రస్వామి దేవస్థా నంలో రాములోరి పెళ్లి కన్నుల పండుగలా జరిగింది. దేవుడి కళ్యాణానికి గ్రామ ప్రజలు పెద్దలుగా, ఆలయ కమిటీ ద్వారా కాటారం లో ఆలయ పూజారి నిఖిల్ శాస్త్రి వేదమంత్రాలతో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు గ్రామ గ్రామాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.