భారతీయ జనతా పార్టీ 45వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకటాపురం మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా పార్టీ జెండాను నాయకులు సంకా హేమ సుందర్, జిల్లా కార్యదర్శి అట్లూరి రఘురాం ల చేతుల మీదుగా పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం వాజ్ పేయి హయాం నుండి నేటి వరకు పార్టీ వెంకటాపురం మండలంలో సీనియర్ కార్యకర్తగా ఉన్న సంక హేమ సుందర్ గుప్తా ను పట్టు శాలువాతో ఘనంగా కార్యకర్తలందరూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ మెంబర్ బొల్లె సునీల్, మండల ప్రధాన కార్యదర్శి సాధన పల్లి విజయ్, సీనియర్ నాయకులు మోదాల సంతోష్ కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు నోముల కిషన్, ఉపాధ్యక్షుడు చిట్టెం ఈశ్వరరావు, బూత్ అధ్యక్షుడు తాడేటి జయరాం, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట సతీష్, కుంజ నరేందర్, చిట్టెం మురళి, కోగిల శీను, మట్టి రమేష్, నాగేంద్రబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.