కాళేశ్వరం పుష్కరఘాటును సందర్శించిన జాయింట్ కలెక్టర్
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : భారీ వర్షాల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ కే.వెంకటేశ్వర్లు కాళేశ్వరం పుష్కర ఘాటును సందర్శించి పలు సూచనలు అందించారు. అదేవిధంగా రైతులు, ప్రజలు, జాలర్లు ఎవరు కూడా అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాలని, అలాగే భక్తులు గోదావరిలో స్నానాలు చేయరాదని తెలి పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పూస్కుపల్లి గ్రామ ప్రజలకు అవసరం అయితే పునరావాస కేంద్రానికి రావాలని అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్ర మంలో మండల స్పెషల్ ఆఫీసర్ మరియు డి ఎల్ పి ఓ వీరభద్రయ్య తహశీల్దార్ రాథోడ్ ప్రహ్లాద్ మరియు పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, గిర్దవారి జగన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.