చింతకాని లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ప్రచారం
కాటారం, తెలంగాణ జ్యోతి : కాటారం మండలంలోని చింత కాని గ్రామంలో ఏఐసీసీ, టీపీసిసి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచనతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,గ్రామ వీధుల్లో పర్యటించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సందేశంను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలు వురు నాయకులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ, అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామన్నారు.ఈ మూడు సూత్రాల మీద దేశం మొత్తం మీద కార్యక్రమం జరుగుతుందని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ సెల్,ఎస్టీ సెల్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.