భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం

భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం

భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం

ఆకాంగ్రెస్ పాదయాత్రలో పథకాల ప్రచారం

– జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న దుద్దిళ్ళ శ్రీను బాబు

కాటారం, తెలంగాణ జ్యోతి : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్ర మంలో బుధవారం కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసిసి ఆదేశాల తో తెలంగా ణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచన మేరకు మహదేవపూర్ మండలం రాపెల్లి కోట గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కమిషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీను బాబు పాదయాత్ర నిర్వ హించారు. గ్రామం లోని వీధుల్లో పర్యటిస్తూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యొక్క సందేశంను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుద్దిల్ల శ్రీపాదరావు ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు వివరిం చారు.మహాత్మాగాంధీ,అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవించాలని, ఈ మూడు సూత్రాలపై దేశంలో కార్యక్ర మాలు నడుస్తున్నాయని అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినా దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రీనుబాబు అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ సెల్ నాయకులు ఎస్టీ సెల్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment