రోడ్డు ప్రమాదాలను నివారించడం మనందరి బాధ్యత.

రోడ్డు ప్రమాదాలను నివారించడం మనందరి బాధ్యత.

– సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు నా పోరిక రాహుల్ నాయక్

ములుగు, తెలంగాణ జ్యోతి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు గాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా ములుగు నేషనల్ హైవే 163పై వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నందున ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ట్రాపిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించడం అందరి బాధ్యత అని సేవాలాల్ సేన రాష్ర్ట అధ్యక్షుడు పోరిక రాహుల్ నాయక్ కోరారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏరియా హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లే మార్గం వద్ద యూటర్న్ తీసుకునే కూడలిలో పోలీస్ శాఖ ప్రమాదాల నివారణ కు యూటర్న్ రూట్ బంద్ చేశారన్నారు. వాహన దారులు వాటిని ప్రక్కకు నెట్టేసి ప్రమాదాలకు గురయ్యే విధంగా వెళ్తున్నారని, పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను పాటించాలన్నారు. నిన్న రాత్రి సమయంలో కానిస్టేబుల్ రోడ్ఉడ ప్రమాదంలో చనిపోయారన్నారు. ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత వహించాలని రాహుల్ నాయక్ వాహనదారులను కోరారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment