ములుగు జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం.
– పోలీస్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు మృతి.
– పెద్ద గొల్లగూడెం గ్రామంలో విషాద ఛాయలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ములుగు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఇంటలిజెన్స్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పొడెం కోటేశ్వరరావు (40) మృతి చెందారు. కానిస్టేబుల్ కోటేశ్వర రావు రోడ్డు దాటుతుండగా తన ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం శనివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది .వెంటనే గాయపడ్డ కానిస్టేబుల్ కోటేశ్వరరావు ను జిల్లా ప్రభుత్వ వైద్య శాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కానిస్టేబుల్ కోటేశ్వరరావు స్వగ్రామం వాజేడు మండలం పెద్దగొల్ల గూడెం గ్రామం. అతనికి భార్య సౌజన్య,కూతురు, కొడుకు వున్నారు. తల్లి, తమ్ముడు, చెల్లెలు పెద్దగొల్ల గూడెం గ్రామంలో నివసిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్నతాధి కారుల ప్రశంసలు పొంది, డ్యూటీయే పరమావధిగా ప్రజల నుండి, పోలీసు అధికారుల నుండి ప్రశంసలు పొందిన మ్రుదు స్వభావి, ప్రతి ఒక్కరిని చిరునవ్వులతో పలకరించే పి.సి. కోటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మ్రుతి చెందటం పట్ల పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం ఉదయం అతని స్వగ్రామమైన వాజేడు మండలం పెద్ద గొల్ల గూడెం గ్రామం లోని వారి ఇంటిక అతని భౌతిక కాయాన్ని తీసుకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాలు కు చెందిన బంధువులు, మిత్రులు వందలు , వేల సంఖ్యలో కానిస్టేబుల్ కోటేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివారం వ్యవసాయ పనులు సైతం మానుకొని కానిస్టేబుల్ కోటేశ్వర రావు ఇంటికి పెద్ద ఎత్తున ప్రజలు తండోప తండాలుగా తరలి వచ్చి కుటుంబ సబ్యులను ఒదార్చారు. నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్లో సుమారు నాలుగు సంవత్స రాలు పైగా వెంకటాపురం పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ గా కోటేశ్వరరావు విధులు నిర్వహించారు. అనంతరం బదిలీపై వివిధ పోలీస్ స్టేషన్లో తో పాటు ములుగు జిల్లా ఎస్పీ కార్యాల యం ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే అతని కుటుంబ సభ్యులు, తల్లి భార్య, పిల్లలు,తమ్ముడు,చెల్లెలు ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. జిల్లా పోలీస్ శాఖ తరపున ఇంటలిజెన్స్ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, తిరుపతి, మరియు వెంకటాపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రేఖ అశోక్ గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మేడారం మహా జాతర సందర్భంగా జిల్లా అధికారులు డ్యూటీలో ఉన్నందున రాలేక పోతున్నారని, ప్రభుత్వ పరంగా పోలీస్ శాఖ తరపున కోటేశ్వరరావు కుటుంబానికి పూర్తిస్థాయి న్యాయం చేస్తామని, ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆదివారం సాయంత్రం కోటేశ్వరరావు పార్ధీవ ధెహానికి అశ్రు నయనాల మధ్య గ్రామస్తులు తరలిరాగ అంతిమయాత్ర నిర్వహించారు. పాడెను వెంకటాపురం ఎస్.ఐ .ఆర్. అశోక్, ఇంటలిజెన్సీ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతి, హరికృష్ణ లు మోసి నివాళులర్పించారు. కానిస్టేబుల్ మ్రుతి తో వాజేడు మండలం పెద్ద గొల్లగూడెం చుట్టు ప్రక్క ల గ్రామాలలో తో విషాదఛాయలు అలుము కున్నాయి. ఈ సందర్భంగా సివిల్ మరియు, సిఆర్పిఎఫ్ సిబ్బంది జిల్లా పోలీస్ శాఖ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది.