బిట్స్ హైస్కూల్లో అంతర్జాతీయ అటవీ దినోత్సవ వేడుకలు
– ప్రిన్సిపాల్ కె .రజనీకాంత్
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ హైస్కూల్లో అంతర్జాతీయ అటవీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములుగు పస్రా రేంజ్ ఆఫీసర్ మాధవి హాజరయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ సంపద, పర్యావరణం పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు “అడవుల పరిరక్షణపై విద్యార్థుల పాత్ర” విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ పోటీలో మొదటి బహుమతి కొలగాని ప్రణీత, రెండవ బహుమతి పి .గమన, స్వేచ్ఛ గెలుపొందారు. గ్లోబల్ వార్మింగ్ అడవుల పరిరక్షణపై నిర్వహించిన వకృత్వ పోటీలో మొదటి బహుమతి పి .మనోజ్ కుమార్,సాహజ్ రెండవ బహుమతి గెలుపొందారు. పాఠశాల ప్రినిపాల్ కె.రజనీ కాంత్ మాట్లాడు తూ ప్రస్తుత ప్రపంచంలో సహజ వనరులు తరిగిపోవడం వల్ల ప్రకృతిలో అసమతుల్యత ఏర్పడి మానవ జీవన విధానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి సహజ వనరులను పెంచుకోవడానికి అధికశాతం మొక్కలు పెంచాలన్నారు.ప్రతి ఒక్క విద్యార్థి తన పుట్టినరోజు ఒక మొక్క నాటాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు నవీన్,శోభన్ విద్యార్థులు పాల్గొన్నారు.