ములుగు : పోలీసుల అదుపులో గుప్త నిధుల తవ్వకాల ముఠా..?
ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా పోలీసుల అదుపులో గుప్తనిధుల తవ్వకాల ముఠా ఉన్నట్లు సమా చారం… మంగపేట మండలంలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయం పరిసరాల్లో పది మంది ముఠాగా ఏర్పడి కొంత కాలంగా గుప్త నిధుల కోసం తవ్వకా లు జరుపుతున్నట్లు పోలికి పోలీసులకు ఉన్న సమాచారం మేరకు తవ్వకాలు జరిగినట్లు నిర్ధారించారు. ఈ మేరకు తవ్వకాలు జరిపిన ముఠాను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. గుట్టపై కొంత కాలంగా అటవీ అభివృద్ధి పనులు చేస్తున్న ఓ ఫారెస్ట్ అధికారితో పాటు అతని సహాయకునిగా పనిచేస్తున్న మల్లూ రుకు చెందిన వ్యక్తి, తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన మరో వ్యక్తి, జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన పది మంది ముఠాగా ఏర్పడి గుట్టపై గుప్తనిధుల కోసం కొంత కాలంగా తవ్వకాలు చేస్తున్నట్లు సమాచారం ఉండగా పోలీసులు వారిపై నిఘా పెట్టి గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించగా ఈ దాడుల్లో గుప్తనిధుల ముఠాకు నాయ కత్వం వహించిన ఫారెస్ట్ అధికారితో పాటు తాడ్వాయి మండలం కాటాపురంకు చెందిన వ్యక్తి మరో 6 గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. వారితో పాటు ఫారెస్ట్ అధికారి బైక్ తోపాటు మరో 6 బైక్ లను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయమై పోలీసు అధికారులను ఫోన్ లో సంప్రదించగా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.