పెద్దంపేటలో సీసీ కెమెరాల ఏర్పాటు
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండ లం పెద్దంపేటలో సోమవారం మహదేవపూర్ పోలీసుల ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను సిఐ రామచందర్ రావు, ఎస్ఐ కె.పవన్ కుమార్ లు ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో సిఐ మాట్లాడుతూ నేర నియంత్రణలో సీసీ కెమెరా లు ఎంతో కీలక పాత్ర వహిస్తాయన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. నిందితులు, అనుమానితులను గుర్తించడంలో కేసుల చేదనలో సీసీ కెమె రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు అందరూ సహకరించాలని, నిఘా నేత్రాలతో ప్రజలకు మరింత రక్షణగా ఉంటుందన్నారు. గ్రామంలో అను మానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే నిషేధిత పదార్థాలైన గుడుంబాను ప్రోత్సహించవద్దని, ఒకవేళ ఎవరైనా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత బాగా చదువుకొని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అలాగే ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, అన్నివేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపా రు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.