మైనర్లతో అక్రమంగా మద్యం తరలింపు..!
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: పాఠశాలకు వెళ్లి పుస్త కాలు చేతుల పట్టుకుని చదువుకునే వయసులో మద్యం సీసాల కాటన్లను ఓ మైనర్ బాలుడితో అక్రమంగా తరలిస్తు న్నారు. వైన్స్ నిర్వాహకులు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి వైన్స్ షాపుల్లో అక్రమంగా మధ్యం తరలింపు జోరుగా కొనసాగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు గా వ్యవహరిస్తున్నారు. పుస్తకా లు, పెన్నులు పట్టుకొని చదువుకోవాల్సిన వయసులో ఓ మైనర్ బాలుడుతో మద్యం సీసాల కాట్లను మోయిస్తూ అక్ర మంగా తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్య కాలం లో బెల్ట్ షాపుల్లో మద్యం జోరుగా అధిక ధరలతో సమయ పాలన లెకుండా అమ్మడం వలన యువత అంత మద్యానికి బానిసలవుతు ఉపాధి సైతం కోల్పోతున్నారు. అక్రమ మద్యా న్ని ఖండించవలసిన సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో ఉంటూ అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆపలేక పోతున్నారాని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి కైనా జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.