వీధిలైట్లను అమర్చండి మహాప్రభో..
– సీతారాంపురం బోదాఫురం గ్రామస్తుల వినతి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధపురం పంచాయతీ పరిధి లోని సీతారాంపురం, బోదాపురం గ్రామాల్లో గత 6 నెలలుగా వీధిలైట్లు వెలగక పోవటంతో రాత్రిపూట చిమ్మ చీకట్లో గ్రామ స్తులు ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచ్ ల పదవీకాలం ముగిసిన కాలం నుండి పంచాయతీ కార్యదర్శు లు, స్పెషల్ ఆఫీసర్లు పరిపాలనలో గ్రామపంచాయతీ లలో సౌకర్యాలు స్తంభించిపోయాయి. సీతారాంపురంలో సుమారు 41 కుటుం బాలకు పైగా ఆదివాసీలు నివసిస్తున్నారు. అలాగే అటవీ ప్రాంతం కావడంతో వీధుల్లో అంధకారం రాజ్యమేలుతున్నది. మాడిపోయిన వీధిలైట్ల స్థానంలో కొత్త లైట్లు వేయాలని పలు మార్లు పంచాయతీ కార్యదర్శికి విన్నవిస్తున్న పట్టించుకునే నాధుడు లేకపోవడంతో గ్రామ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ప్రధాన రహదారి పక్కనే ఉన్న భోదాపురం గ్రామంలో సైతం మాడిపోయిన వీధిలైట్ల స్థానంలో 6 నెలలైనా నేటికీ కొత్తలైట్ల అమర్చకపోవడంతో అంధకారంలో రాజ్యమేలుతున్నది. అసలే అటవీ ప్రాంతం కావడంతో వీధులలో పాములు, తేళ్లు ఇతర విష పురుగులు సంచరిస్తుంటాయని, కనీసం వీధిలైట్ల కూడా లేకుండా పోయా యనీ పంచాయతీ ప్రజలు దుమ్మెత్తు పోస్తున్నారు. ఈ సీజన్లో ఒకసారి మాత్రమే బ్లీచింగ్ పౌడర్ చేశారని, పంచాయతీ కార్యదర్శి ప్రజలకు అందుబాటు లేకుండా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి బోదా పురం పంచాయతీ గ్రామాలలో వీధి ధీపాల సౌకర్యం కల్పిం చాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని భోదాపురం, సీతారాంపురం గ్రామ గిరిజనులు పత్రికా ముఖంగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.