మంథని నియోజకవర్గంలో నూతన రోడ్లకు రూ. 25 కోట్లు నిధులు

మంథని నియోజకవర్గంలో నూతన రోడ్లకు రూ. 25 కోట్లు నిధులు

– ఐ టీ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు వెల్లడి

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: మంథని నియోజక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వ సీ ఆర్ ఆర్ నిధుల నుండి నూతన రోడ్లకు 25 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు వెల్లడించారు. మంథని నియోజకవర్గంలోని, పీ డబ్లు డీ రోడ్ నుంచి ఎల్ మడుగు వయా ఖానాపూర్, కమాన్ పూర్ నుంచి పెంచికల్ పేట, రాజాపూర్ నుంచి మంగపేట (కమాన్ పూర్), దామెర కుంట నుంచి మానేరు (అరేంద), ఒడిపిలపంచ నుంచి గూడూరు, గుండ్రాత్ పల్లి నుంచి ఉట్లపల్లి పోచమ్మ టెంపుల్, పీ డబ్లూ డీ రోడ్డు నుంచి ధన్వాడ వయా బూడిది పల్లి వరకు సీ ఆర్ ఆర్ కింద 25 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఖానాపూర్ గ్రామం వద్ద పీ డబ్ల్యూ డీ రోడ్ నుండి ఎల్ మడుగు వరకు వయా ఖానాపూర్ 5 కిలోమీటర్ల రోడ్డు వెడల్పు కొరకు 7 కోట్ల నిధులు మoజూరయ్యాయి. కమాన్ పూర్ మండలంలోని కమాన్ పూర్ నుండి పెంచికల్ పేట వరకు రోడ్డు వెడల్పు మూడు కిలోమీటర్లకు 4 కోట్ల నిధులు మoజూరయ్యాయి. రాజాపూర్ బ్రిడ్జి , రోడ్డు కోసం రాజాపూర్ నుండి మంగపేట (కమాన్ పూర్) వరకు 3 కోట్ల ఐదు లక్షలు నిధులు మంజూరయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం లోని ఓడిపిలవంచ గ్రామంలో ఒడిపిల వంచ నుండి గూడూరు వరకు రోడ్డు కొరకు 2.5 కిలోమీటర్లకు 3 కోట్ల నిధులు మంజూరయ్యాయి.గుండ్రాత్ పల్లి గ్రామం నుండి ఉట్లపల్లి పోచమ్మ టెంపుల్ 2 కిలోమీటర్లు 2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పీ డబ్ల్యు డీ రోడ్డు 3 దామర కుంట నుండి మానేరు (ఆరేంద) వరకు 2 కిలోమీటర్లు 2 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పీ డబ్లూ డీ రోడ్డు నుండి ధన్వాడ గ్రామం వయా బూడిది పల్లి వరకు 3.7 కిలోమీటర్ల రోడ్డు 3 కోట్ల 95 లక్షలు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవ హారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చొరవతో శుక్రవారం సీ ఆర్ ఆర్ నుండి మంథని నియోజకవర్గానికి 25 కోట్ల రూ. నిధులు రోడ్లకు మంజూరయ్యాయని మంత్రి క్యాంపు కార్యాల యం ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు మంథని, కమాన్ పూర్ ,కాటారం మండలాలకు రోడ్లకు నిధులు మంజూరుకు కృషి చేసిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు మంథని, కమాన్ పూర్, కాటారం మండలం, ఖానాపూర్, పెంచికల్ పేట, కమాన్పూర్, రాజాపూర్, దామెర కుంట, గుండ్రత్ పల్లి, ఒడిపిలవంచ, గూడూరు,ధన్వాడ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment