ములుగులో నవోదయ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం

ములుగులో నవోదయ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం

ములుగులో నవోదయ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం

– 15 నిమిషాలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభం

– ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

ములుగు ప్రతినిధి తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రం లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నవోదయ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగింది. పరీక్షా కేంద్రంలోకి 15 నిమిషాలు ఆలస్యంగా పంపించడంతో పాటు పేపర్ ఇచ్చిన తరువాత మరో 15 నిమిషాలు బబ్లింగ్ కు సమయం కేటా యించడంతో సమయం సరి పోలేదంటూ విద్యార్థులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. శనివారం జరిగిన జవహర్ నవోదయ ఎంట్రన్స్ పరీక్ష ములుగు మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో, బండారుపల్లి మోడల్ పాఠశాలలో పరీక్షా కేంద్రాల ను ఏర్పాటు చేసి నిర్వహించారు. బాలుర ఉన్నత పాఠశాలలో 153 మందికి 108 హాజరు కాగా, మోడల్ పాఠశాలలో 192 మందికి గాను 168మంది హాజరైనట్లు అధికారులు వెల్లడిం చారు. నవోదయ విద్యాలయ నిబంధనల మేరకు పరీక్షా కేంద్రా ల్లోకి ఉదయం 10.30 గంటలకు అనుమతించాల్సి ఉండగా 10.45గంటలకు అనుమతించారు. పరీక్షా సమయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు 80ప్రశ్నలకు 120నిమిషాల సమయం కేటాయించారు. అయితే బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష రాసిన విద్యార్థులకు 7గదులను కేటాయించారు. కేంద్రంలోకి 15నిమిషాలు ఆలస్యంగా అనుమ తించిన అధికారులు ప్రశ్నాపత్రాన్ని 11.30గంటలకు ఇవ్వడంతో చిన్నారులు తమ పేర్లను నమోదు చేసుకోవడం, బబ్లింగ్ చేయడం, ఇన్విజిలేటర్ బాధ్యతల నిర్వహణతోనే సుమారు 15 నిమిషాల నుంచి 20నిమిషాల వరకు సమయం వృధా అయినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షా కేంద్రాలలోకి గంట ముందు అనుమతించేదే ఓఎంఆర్ షీట్లను వెరిఫై చేసుకుంటూ ఇతర ఇన్విజిలేటర్ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సీఎస్, ఇతర అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్రంగా నష్టోయినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తు న్నారు. 15 నిమిషాలు అంటే 15ప్రశ్నల సమయం వృధా జరిగిందని చెబుతున్నారు. ఆలస్యం అయిన కేంద్రాల్లో అదనపు సమయం ఇచ్చే అవకాశం ఉన్నా ఆవిధంగా చర్యలు తీసుకోక పోవడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడల్ పాఠశాలలో సైతం బబ్లింగ్ పద్ధతి కోసం 10నిమిషాలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభించాల్సి వచ్చిందనే ఆరోపణలూ ఉన్నాయి. కష్టపడి చదివిన విద్యార్థులకు సమయం సరిపోక పోవడంతో పరీక్ష సరిగా రాయలేక పోయామని కేంద్రాల నుంచి బయటకు వచ్చిన అనంతరం తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నా రు. నవోదయ సీటు కోసం పిల్లలకు లక్షలు పెట్టి కోచింగ్ ఇప్పించి పరీక్ష రాయిస్తే జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇన్విజిలేటర్ల తీరుతో తమ పిల్లలు తీవ్రంగా నష్టపోయామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నవోదయ విద్యాలయ సంస్థ ఉన్నతా ధికారులు ములుగులోని బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్రారంభానికి జరిగిన ఆలస్యంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నష్టోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తు న్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష జరిగిందని, వాటిని పరిశీలించి లోతైన విచారణ జరపాలని కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తోపాటు నవోదయ విద్యాలయ సంస్థ జాతీయ స్థాయి అధికారులకు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment