ములుగు జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సదర్భంగా జిల్లా ప్రగతి నివేదిక వినిపించారు.
👉 ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక 78వ భారత స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు.
👉 జాతిపిత మహాత్మాగాంధీ, పండిత్ జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులు ఊదారు.
👉 ములుగు జిల్లా 2019లో ఏర్పడినప్పటి నుండి వెనుకబడిన జిల్లాగా ఉండగా కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రణాళికలు రూపొందించాం. అందులో భాగంగా జిల్లాలో నూతన సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయ భవననిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నవి.
👉 సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలలోని ఆదివాసి గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు రాష్ట్రంలోనే తొలిసారిగా నూతన ఆలోచనతో రెండు కంటైనర్ హాస్పిటల్స్ మరియు పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది.
👉 శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు గతంలో ఎన్నడు లేనివిధంగా రూ.110 కోట్లు వెచ్చించి ఒక కోటి 50 లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతరను ముగించుకున్నాం.
👉 మహాలక్ష్మి పథకంలో భాగంగా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 46లక్షల 66వేల 852 మంది మహిళలకు 25కోట్ల 10 లక్షల 71వేల 823 రూపాయలను ఖర్చు చేయడం జరిగినది.
👉 జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రంలో రూ.2కోట్లు, మంగపేటలో రూ.52 లక్షల నిధులతో మాడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో రూ.4.5 కోట్లతో కొత్త బస్ డిపో నిర్మించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
👉 వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం సేవలను 10 లక్షల వరకు పెంచినాము. జిల్లాలో ఇప్పటి వరకు 3021 మందికి 565 రకాల వైద్య సేవలకు గాను రూ.6 కోట్ల 28 లక్షల 45 వేల 804 రూపాయాల లబ్ది జరిగింది. సీజనల్ వ్యాధుల నిర్మూలన కొరకు ఇంటింటి జ్వరం సర్వేలు ప్రతి 15 రోజులకు ఒక్క సారి నిర్వహించి ఇప్పటి వరకు 44 వేల 913 గృహలను సందర్శించాము. అందులో 31 మలేరియా, 11 డెంగి కేసులు నిర్ధారించి, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం జరిగినది.
👉 అటవీ ప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం అందించుటకు రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా నూతన ఆలోచనతో తాత్కాలిక రూ.14లక్షలతో 2 కంటైనరులను సమ్మక్క- సారలమ్మ తాడ్వాయి మండలంలోని పోచాపుర్, వాజెడు మండలంలోని ఏడ్చర్లపల్లిలో నిర్మాణం చేయడం జరిగినది.
👉 ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సంవత్సరం వైద్య విద్యార్థుల అడ్మీషన్ కౌన్సిలింగ్ తదుపరి జిల్లాలో సెప్టెంబర్ మాసంలో ఎం.బి.బి.ఎన్. మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించడానికి ప్రత్యేక వైద్య నిపుణులు, ఇతర ప్రత్యేక భోధన విభాగాలు, అధునాతన తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరి, లెక్చర్ హాలులు, విద్యార్థులకు నివాస వసతితో సహ అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగినది.
👉 సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం కోసం దాదాపు 337 ఎకరాల భూమికేటాయింపు చేయడం జరిగినది. ఈ నెలలో అడ్మిషన్లు చేపట్టి, వచ్చే నెలలో మొదటి బ్యాచ్ ప్రారంభం కానున్నది.
👉 ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారెంటీలు పథకాల కోసం ప్రజల నుండి 99,364 దరఖాస్తులు సేకరించి ప్రతి దరఖాస్తును పరిశీలించడం జరిగింది.
👉 విద్యుత్ శాఖ ద్వారా గృహ జ్యోతి పథకం ద్వారా జిల్లాలో 200 యూనిట్ల వరకు 37 వేల 478 విధ్యుత్ వినియోగదారులకు ఉచితంగా జీరో బిల్లులు అందించడం జరిగింది. జిల్లాలో 26 వేల 106 వ్యవసాయ బావులకు 110 కోట్ల వ్యయంతో 24 గంటల ఉచిత విద్యుత్, 250 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న నాయిబ్రాహ్మణులు, రజకులకు (సేలున్, దోభీఘాట్) లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతున్నది.
👉 పౌర సరఫరాల శాఖ ద్వారా నిరుపేద మధ్య తరగతి కుటుంబాలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో 45 వేల 352 మందిని అర్హులుగా గుర్తించి, ఇప్పటి వరకు 500 రూపాయల చొప్పున 71 వేల 768 సిలెండర్లను డెలివర్ చేశాం. జిల్లాలో ఇప్పటి వరకు రబీ, ఖరిఫ్ పంటలకు 144 కొనుగోలు కేంద్రముల ద్వారా ఒక లక్ష 47 వేల 907 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 20 వేల 16 మంది రైతులకు 323 కోట్ల 09 లక్షల రూపాయలను చెల్లింపు చేయడం జరిగింది.
👉 మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండములోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుపొందింది.మహా జాతర అభివృద్ధి పనులు చేపట్టుటకు వివిధ శాఖలకు 110 కోట్లు రూపాయలను మంజూరి చేశాం. వివిధ శాఖల ద్వారా శాశ్వత, తాత్కాలిక పనులు చేపట్టి ఫిబ్రవరి 21వ తేది నుండి ఫిబ్రవరి 24వ తేది వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ జాతర నిర్వహణలో భక్తుల ద్వారా మేడారం దేవస్థానమునకు రూ.13 కోట్ల 25 లక్షల 22 వేల రూపాయలు ఆదాయం సమకూరింది.
👉 జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధ్వర్యంలో గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో చేపట్టిన ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్స్ జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో, బొగత వాటర్ ఫాల్స్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సంఘాలకు రూ.2 లక్షల వరకు రుణ బీమా, రూ.10 లక్షల వరకు ఇందిరా జీవిత బీమా పథకం ప్రవేశ పెట్టాం.
👉 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 16 లక్షల 49 వేల పనిదినాలు కల్పించి, 63 వేల 468 మంది కూలీలకు 34 కోట్ల 17 లక్షల రూపాయలను వేతనంగా చెల్లించడమే కాకుండా రూ.2కోట్ల 22 లక్షల రూపాయలను మెటీరియల్ కొరకు ఖర్చు చేయడం జరిగింది. బ్యాంకు లీకేజీ కింద 560 స్వశక్తి మహిళా సంఘాలకు 56 కోట్ల 30 లక్షల రుణాలు మంజూరు చేశాం. స్త్రీ నిధి కింద 37 వి.ఓ. లకు, 172 స్వశక్తి సంఘాల సభ్యులకు 6కోట్ల 2లక్షలు మంజూరు చేశాం. ఆసరా పెన్షన్ పథకం ద్వారా 39వేల 103 మంది లబ్దిదారులకు 9 కోట్ల 55 లక్షలు ప్రతి నెల పంపిణీ చేస్తున్నాం.
👉 జిల్లా పంచాయతీ శాఖ ద్వారా జిల్లాలోని 174 గ్రామ పంచాయితీలలో ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించి, డంపింగ్ యార్డులకు తరలించి గ్రామంలో పరిశుభ్రంగా ఉంచుతున్నం. స్వచ్చ దనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజల సహకారంతో 659 కిలో మీటర్ల రోడ్డు, 346 కిలో మీటర్ల డ్రైనేజీ కాలువలు, 207 లోతట్టు ప్రాంతాల శుభ్రం మరియు 117 శిథిలావస్థలో ఉన్న గృహాల తొలగింపు చేపట్టడం జరిగినది.
👉 వ్యవసాయ రంగం సంక్షేమంలో కూరుకొని అల్లాడిన రైతుల్లో తిరిగి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు తేది. 12-12- 2018 నుండి తేది. 09-12-2023 లోపు తీసుకున్న రైతులకు మొదటి, రెండవ విడతల్లో 19 వేల 644 రైతులకు రూ.137 కోట్ల 41 లక్షల వంట రుణమాఫీ చేయడం జరిగింది. 3 వ విడతగా ఈ రోజు రూ.2 లక్షల వరకు ఋణమాఫీ చేయడం జరుగుతున్నది. రైతు బీమా పథకం కింద జిల్లాలో 243 మంది రైతు కుటుంబాలకు రూ.12 కోట్ల 15 లక్షలను రైతుల నామినిల కుటుంబ ఖాతాలో జమ చేయడం జరిగింది. పి.ఎం. కిసాన్ పథకం కిందజిల్లాలో రూ.4 కోట్ల 71 లక్షలను 23 వేల 565 రైతుల ఖాతాలో జమ చేయడం
👉 పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో జిల్లాలో సిఆర్ఆర్. పథకం ద్వారా రూ.8 కోట్ల 69 లక్షలతో 7రోడ్లు, ఎంఆర్ఆర్ పథకం ద్వారా రూ.13 కోట్ల 87 లక్షలతో 15రోడ్లు మంజూరు చేయడం జరిగినది. అంతేకాకుండా సుమారు రూ.250కోట్ల అంచనా వ్యయంతో వివిధ రోడ్డు పనులు చేపట్టుట జరుగుతున్నది. రహదారులు, భవనముల శాఖ ద్వారా జిల్లాలో ఎస్టి.యస్.డి.ఎఫ్., ఆర్.డి.ఎఫ్., తదితర పథకాల ద్వారా 68 పనులకు గాను రూ.370 కోట్ల 98 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయ భవనం (కలెక్టరేట్), రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిమిత్తం 63 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది.
👉 నేషనల్ హైవే 163 హైదరాబాద్ నుండి భూపాలపట్నం రోడ్డును జిల్లా పరిధిలో జంగాలపల్లి నుండి మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, పస్ర వరకు రెండు లేన్లను నాలుగు లేన్లుగా రోడ్డు వెడల్పు చేయుటకు రూ .300 కోట్లు మంజూరు అయినవి. పనులు వివిధ దిశలలో జరుగుచున్నవి.
👉 గిరిజన అభివృద్ధి శాఖలో గిరిజన భవనములు, NRHM, BT Roads, స్కూల్స్, వసతి గృహముల మరమ్మతులు జి.పి. మోడల్ స్కూల్స్ గురుకులములకు రూ.106 కోట్ల 37లక్షల 69 వేలతో 424 పనులు మంజురుకాగా, 359 పూర్తి అయినవి.
👉 జిల్లాలో ధరణి పోర్టల్ లో 11 వేల 584 దరఖాస్తులు రాగా 10 వేల 961 పరిష్కరించబడినవి. భూ సమస్యల పరిష్కారం దిశగా నూతన రెవెన్యూ చట్టంఅమలు ముసాయిదాను తయారు చేసి ప్రజల నుండి అభిప్రాయలు సేకరించడం జరుగుతున్నది.
👉 ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలు ప్రతి ఒక్కరికీ సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో బాగంగా మన జిల్లాకు 3790 ఇండ్లను మంజూరు చేయడం జరిగింది.
👉 అటవీ శాఖలో వన మహోత్సవములో భాగంగా 174 గ్రామ పంచాయితీలలో 13లక్షల 44 వేల మొక్కలను నాటడం జరుగుతుంది. వివిధ శాఖలలోని నర్సరీలలో 26 లక్షల 40 వేల మొక్కలను పెంచడం జరిగినది.
👉 ఉద్యానవన శాఖలో సూక్ష్మ నీటి సేద్య పథకంలో భాగంగా 125 మందికి 395.36 ఎకరాలలో 87 లక్షల 56 వేల విలువైన బిందు సేద్యం పరికరాలు ఇవ్వడం జరిగినది. సమీకృత జాతీయ నూనె గింజల, పామ్ ఆయిల్ పథకంలో భాగంగా 269 మంది రైతులకు 859.48 ఎకరాలలో పరిపాలన అనుమతితో 32 లక్షల 55 వేల రూపాయలను సబ్సిడీ ఇవ్వడం జరిగినది.
👉 విద్యాశాఖ జిల్లాలో ఉన్న 7 కళాశాలలకు టాయిలెట్ బ్లాక్స్, 39 లక్షలతో ప్రహరీ గోడ, ఐరన్ గ్రీల్స్ ఏర్పాటు చేయడం జరిగినది. ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లాలోని 552 పాఠశాలకు గాను 318 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా రూ.8 కోట్ల 42 లక్షలు మౌలిక వసతుల కల్పన కొరకు ఖర్చు చేయడం జరిగినది.
👉 పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఆదివాసి పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాడ్వాయి మండలం తక్కల్లగూడెం గ్రామంలో పాఠశాలను నిర్మించడం జరిగింది. సైబర్ నేరాలలో మోసపోయిన భాధితులకు ఈ సంవత్సరంలో 14 లక్షల 8 వేల 631 రూపాయలను భాధితులకు తిరిగి అప్పగించడం జరిగింది.