జాతీయ జెండా రంగులతో రామప్ప వెలుగులు
– స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అలంకరణ
ములుగు ప్రతినిధి : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం మువ్వన్నెల జెండా రంగులతో వెలుగుతోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోగల రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా అధికారులు విద్యుత్ కాంతు లతో అలంకరించారు. టూరిజం, పురావస్తుశాఖ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. దీంతో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని దేదీప్యమాణంగా అలంకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ దృశ్యాలను చూసి అబ్బురపడుతున్నారు.