సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు
– నేటి నుంచి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్యం
– చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలలో పేరెంట్స్ కమిటి సమావేశం
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలోని చిన్న బోయినపల్లి ఆశ్రమ ఉన్నత పాఠ శాలలో శనివారం పేరెంట్స్ కమిటీ మీటింగ్ ను ప్రధానోపా ధ్యాయులు మడే నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా ఏటూరునాగారం ఎంపీడీవో రాజ్యలక్ష్మి హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లా డుతూ పిల్లలో ఆరోగ్యం సక్రమంగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని గిరిజన ఆశ్రమ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే తేడా లేకుండా అన్ని గురుకుల పాఠశాలలో పౌష్టికాహార విలువలతో కూడిన భోజనం ఏర్పాటు చేయా లన్న ఉద్దేశంతో 4 వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క విధం గా మెను ప్రవేశపెట్టారని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపా రు. అంతేకాకుండా ఒక్కొక్క విద్యార్థికి రోజుకు 45 రూ. ఖర్చు గవర్నమెంట్ అందిస్తుందన్నారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు 1510 రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేశారని పేరెంట్స్ కమిటీ వాళ్లకు తెలియజేశారు. ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్య సించే విద్యార్థులకు చదువుతో పాటుగా పౌష్టిక ఆహార విలు వలను అందజేయడంలో మేము మా వంతు బాధ్యతగా నిర్వర్తిస్తామని ఆయా విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ రాజారాం, పేరెంట్స్ కమిటీ అధ్యక్షురాలు సంధ్యారాణి, గ్రామపంచాయతీ కార్యదర్శి కే కృష్ణారావు, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.