కండక్టర్ నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు మృతి..!
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : బస్సు కండక్టర్ నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన శనివారం బుట్టయిగూడెంలో జరిగింది.వివరాల్లోకి వెళితే.. కన్నాయిగూ డెం మండల దేవాదుల గ్రామానికి చెందిన చిలుముల లక్ష్మి(70) బుట్టాయిగూడెం తాటిచెట్ల వద్ద ఏటూరునాగారం నుంచి తుపాకులగూడెం వెళ్తున్న బస్సు ఎక్కే క్రమంలో బస్సు ముందుకు కదలగా ఆమె చీర బస్సు కు ఇరుక్కుపోయింది. కనీసం ఆపమని కూడా డ్రైవర్‌కి కండక్టర్ అప్రమత్తం చేయక పోవడంతో కండక్టర్ నిర్లక్ష్యం వల్లనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆర్టీసీ బస్సు ను పోలీస్ స్టేషన్ కు తరలించారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.