ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు.
– ములుగు అదనపు కలెక్టర్ శ్రీజ.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ప్రజాపాలన అభహస్తం గ్రామ సభలలో ప్రజల నుండి స్వీకరించే దరఖాస్తులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు జత చేయవలసి న అవసరం లేదని ముందుగా సూచించిన వాటినే దరఖాస్తులలో పొందుపరచాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. శుక్రవారం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం, వాజేడు మండ లాల్లో అదనపు కలెక్టర్ శ్రీజ ప్రజాపాలన అభయహస్తం గ్రామ కేంద్రా లను దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించా రు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల వద్ద నుండి వారు పొందుపరిచిన అంశాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. కొంతమంది తెలియక ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ ప్రచారం జరుగుతుందని, ఇప్పుడు అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్య క్రమాన్ని ప్రతి ఒక్కరు సద్విని యోగం చేసుకోవాలని ఈ సందర్భం గా అదనపు కలెక్టర్ శ్రీ జ కోరారు. వెంకటాపురం మండలంలోని ఉప్పెడు వీరాపురం ,వి. ఆర్ .కె పురం, బెస్తగూడెం గ్రామాల్లో శుక్రవారం మూడు ప్రాంతాల్లో ప్రజా పాలన అభయహస్తం గ్రామ కేంద్రాలు లో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలు నుండి ఆయా పంచా యతీ ప్రజల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అనంత రం వెంకటాపురం మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రాలను అదన పు కలెక్టర్ శ్రీజ ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రతి మీ సేవ కేంద్రం ముందు ధరల పట్టిక ప్రదర్శించాలని, అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా మీ సేవ నిర్వాహకులను హెచ్చరించారు.ఆయా కాపీ లకు నిర్ధేశిత ధరల పట్టిక ద్వారా వసూలు చేయాలని ఆదేశించా రు. ప్రతి మీసేవ కేంద్రాల్లో ప్రజల నుండి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంకటాపురం మండల కేంద్రంలోని రెండు మీసేవ కేంద్రాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేసి వెంటనే ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం తాసిల్దార్ సమ్మయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు ఆయా ప్రజా పాలన కేంద్రాల స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ప్రజాపాలన టీం సిబ్బంది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
1 thought on “ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు. ”