కాటారంలో భారత రాజ్యాంగ స్తూపం ఆవిష్కరణ
కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం అంబేడ్కర్ కూడలిలో శనివారం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.చౌరస్తాలో నూతనంగా నిర్మించిన భారత రాజ్యాంగ స్థూపమును మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నియోజ కవర్గం ఇన్చార్జి పుట్ట మధుకర్, భూపాలపల్లి మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ జక్కు శ్రీహర్షిని రాకేశ్ తో కలిసి ఆవిష్కరించి జైభీం అంటూ నినదించారు. మహాదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.