వెంకటాపురం మండలంలో పురుగుమందు తాగి ఇరువురి ఆత్మహత్యాయత్నం
– పరిస్థితి విషమం, ఏటూరునాగారం తరలింపు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో శనివారం వేరు వేరు గ్రామాల్లో పలుకారణాలతో ఇరువురు పురుగుమందు తాగారు. మండల పరిధిలోని బర్లగూడెం పంచాయతీ మహితా పురం గ్రామానికి చెందిన వాసం శరత్ అనే యువకుడు పురుగు మందు తాగగా అతనిని హుటాహుటిన 108 అంబులెన్స్ లో వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే వీరభద్రవరం గ్రామానికి చెందిన మడకం సతీష్ అనే వ్యక్తి పురుగు మందు తాగగా అతనిని కూడా 108 అంబులెన్స్ లో వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటం తో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఇరువురిని 108 అంబులెన్స్లో హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం తరలించారు. శుక్రవారం వెంకటా పురం మండల కేంద్రం శివాల యం వీధికి చెందిన యువకుడు పురుగు మందు తాగి ఆత్మ హత్య చేసుకున్న 24 గంటలు గడవక ముందే, మరో ఇరువురు మండలంలో శనివారం పురుగు మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం మండలంలో చర్చనీయాంశ మైంది. పురుగు మందు కేసులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.