అంకన్నగూడెం, పూజారిగూడెం లో పీసా గ్రామ సభలు ఏకగ్రీవం.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం లోని రామచంద్రాపురం గ్రామ పంచాయతీలో గల అంకన్నగూడెం, పూజారిగూడెం పీసా ఇసుక గ్రామ సభలు బుదవారం నిర్వహించగా గ్రామ సభలు ఏకగ్రీవంగా ఆమోదం అయ్యాయని ఎంపిడిఒ ఎ.బాబు ఒక అదికారిక ప్రకటనలో పత్రికా ముఖంగా తెలియ జేశారు. బుదవారం ములుగు జిల్లా కలెక్టర్ , ఐటిడిఎ భద్రాచలం పి.ఒ. ఆదేశానుసారం, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి,మండల తహసిల్దార్ ఎస్డీ సర్వర్ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. అంకన్నగూడెం గ్రామ సభను ఉదయం 10:00గంటలకు ఏర్పాటు చేయగా, 43మంది ఓటర్లు ఉండగా, 1/3 వంతు కోరం ప్రకారంగా 14 మంది హాజరు కావాల్సి ఉండగా, 41మంది హాజరై, ఆ గ్రామంలో ఉన్న సిద్ది వినాయక సొసైటీ కి ఇసుక నిర్వహణ భాద్యతలు అప్పగిస్తూ 41మంది ఆదివాసీలు ఏకగ్రీవంగా తీర్మానించారు.అదేవిధంగా తధనం తరం మధ్యాహ్నం పూజారిగూడెం గ్రామ సభ కు 49 మంది హాజరైనారు. కోరం ప్రకారం 1/3 వంతు ప్రకారం, 16 మంది కోరం కాగా ,49 మంది ఆదివాసీలు హాజరు అఇ ఏకగ్రీవంగా సమ్మక్క – సారలమ్మ సొసైటి కి ఇసుక నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ ఏకగ్రీవం గా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమం లో ఎ.టి.డి.ఒ. అశోక్ భద్రాచలం పీసా ప్రత్యేక అధికారి, వెంకటాపురం పోలీస్ సి.ఐ. బండారి కుమార్ , వెంకటాపురం ఎస్.ఐ. ఆర్.అశోక్ , ములుగు జిల్లా పీసా కోఆర్డినేటర్ కె.ప్రభాకర్ , పంచాయతీ కార్యదర్శి, పీసా ఉపాధ్యక్షులు, కార్యదర్శి, గ్రామ కుల పెద్దలు , పీసా మొబిలైజర్లు ఇర్ప రాజు తదితరులు పాల్గొన్నారు. రెండు గ్రామసభలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.