ద్విచక్ర వాహనాలు ఢీ – ముగ్గురికి గాయాలు.
– తృటిలో తప్పిన ప్రాణాపాయం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం పట్టణంలో మంగళవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఎదురెదురుగా వస్తున్న మోటార్ సైకిల్, స్కూటర్ లు ఢీ కొన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి… వెంకటాపురం పట్టణ కేంద్రంలోని కరెంట్ ఆఫీస్ సమీపంలో మీసేవ కేంద్రం ఎదురుగా ప్రదాన రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మైనర్ విద్యార్థులు స్కూటర్ పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై వస్తున్న జి. లక్ష్మణ్ అనే యువకుడి కాలికి తీవ్ర గాయం అయింది. స్కూటర్ పై వస్తున్న ఇరువురు మైనర్ విద్యార్థు లకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం పై క్షత గాత్రులను వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జి. లక్ష్మణ్ అనే యువకుడిని మెరుగైన వైద్యం కోసం ఎటు రు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేసినట్లు సమాచారం. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని పోలీస్ శాఖ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన వారి,వారి పెద్దలు నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదం చోటు చేసుకొని స్వల్ఫ గాయాలతో అదృష్ట వశాత్తు బయటపడ్డారు.