బీజేపీ ములుగు పట్టణ అధ్యక్షుడిగా ఇమ్మడి రాకేష్ యాదవ్
ములుగు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): బీజేపీ ములుగు పట్టణ అధ్యక్షుడిగా ములుగు పట్టణానికి చెందిన ఇమ్మడి రాకేష్ యాదవ్‌ను నియమిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం నియామక పత్రాన్ని అందజేశారు. విద్యార్థి దశ నుంచే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో పనిచేస్తూ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసిన రాకేష్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి జేఏసీ ద్వారా చురుకైన పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తరువాత వెనుకబడిన గిరిజన ప్రాంతమైన ములుగును ప్రత్యేక జిల్లాగా చేయాలనే లక్ష్యంతో ప్రజా ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. తనను పట్టణ అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ఇమ్మడి రాకేష్ యాదవ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.






