నూగూరు వద్ద గుడుంబా పట్టివేత – కేసు నమోదు 

Written by telangana jyothi

Published on:

నూగూరు వద్ద గుడుంబా పట్టివేత – కేసు నమోదు 

వెంకటాపురం నూగూరు,  తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం నూగూరు గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై వెంకటాపురం పి.ఎస్. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కె.తిరుపతిరావు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ద్విచక్ర వాహనంపై సారాను సల్పాల రవి,బొల్లె వినోద్ కుమార్ లు ద్విచక్ర వాహనంపై గుడుంబాను తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెంకటాపురం ఎస్సై కే. తిరుపతిరావు మీడియాకు తెలిపారు. వారి వద్ద నుండి  సుమారు 110 లీటర్ల గుడుంబాను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్టు ఎస్సై తెలిపారు.

Leave a comment