తాగి డ్రైవింగ్ చేస్తే ఇక జైలు గతే ! తస్మాత్ జాగ్రత్త !!
– ఎస్సై అభినవ్ హెచ్చరిక
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: తాగి వాహనాలు నడిపి నట్లయితే ఇక జైలు గతే అని కాటారం ఎస్సై మ్యాక అభినవ్ హెచ్చరించారు. కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో తాగి వాహనాలు నడిపిన వ్యక్తులకు జరిమానా తో పాటు జైలు శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. తాజాగా ఇబ్రహీం పల్లికి చెందిన దెబ్బట చంద్రశేఖర్ కు, గూడూరు కు చెందిన పొట్ల సన్నీకి జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్జి జైలు శిక్ష విధించారు. వీరిద్దరిని పరకాల సబ్ జైలుకు తరలించారని ఎస్ఐ అభినవ్ తెలిపారు. ఇంతకుముందు ఈనెల 15న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు ఎస్ ఐ అభినవ్ గుర్తు చేశారు. భూపాలపల్లి కోర్టు మెజిస్ట్రేట్ రామచందర్ రావు తీర్పు మేరకు కాటారంకు చెందిన బొడ్డు శ్రీధర్, మహా ముత్తారం మండలం కనుకునూరుకు చెందిన రేగ నాగభూషణ్ అనే వ్యక్తులకు తాగి డ్రైవింగ్ చేసినందుకు గాను వెయ్యి రూపాయల జరిమానతో పాటు నాలుగు రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. వీరిని పరకాల సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.